అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం... లాక్ డౌన్ నిబంధనలు సడలింపు

Telangana loosens lock down restrictions
  • ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై ఆంక్షల ఎత్తివేత
  • జూన్ 7 వరకు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత పరిస్థితి కొనసాగింపు
  • రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించింది. ముఖ్యంగా, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. తెలంగాణలో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

ఆసుపత్రులు, మెడికల్ షాపులు మినహాయించి మిగతా అన్ని దుకాణాలకు రాత్రి 8 గంటల వరకే అనుమతించారు. ఈ మేరకు లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే,  జూన్ 7 వరకు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత స్థితి కొనసాగించాలని నిర్ణయించారు. కాగా, తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.
Go Back to Shorts
Telangana
Lockdown
Restrictions
Travels
Corona Virus

More Telugu News