చరిత్రాత్మక ఘట్టం... ఆస్ట్రోనాట్స్ ను స్పేస్ లోకి తీసుకెళ్లిన ప్రైవేటు సంస్థ... వీడియో!
- నిన్న రాత్రి యూఎస్ లో రాకెట్ ప్రయోగం
- నేడు అంతరిక్ష కేంద్రానికి చేరనున్న వ్యోమగాములు
- తన కల సాకారమైందన్న ఎలాన్ మస్క్
మొత్తం 19 గంటల పాటు ప్రయాణాన్ని కొనసాగించనున్న వ్యోమగాములు, ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో వేచి చూస్తున్న ఇద్దరు రష్యా, ఒక అమెరికన్ ఆస్ట్రోనాట్స్ ను నేడు కలుసుకోనున్నారు. ఈ ప్రయోగంతో అంతరిక్షానికి వాణిజ్య సేవలను ప్రారంభించినట్లయిందని స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. తన కల నిజమైందని ఆయన అన్నారు.
కాగా, 'డెమో-2' అనే పేరుతో ఈ రాకెట్ ప్రయోగం జరిగింది. స్పేస్ ఎక్స్ తయారుచేసిన డ్రాగన్ క్యాప్స్యూల్ కు నాసా సర్టిఫికెట్ లభించిన తరువాత, ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక ఈ రాకెట్ ద్వారా అంతరిక్షానికి చేరుకున్న వ్యోమగాములు, నేటి రాత్రి 8 గంటల సమయంలో స్పేస్ స్టేషన్ కు చేరనున్నారు. అక్కడ వీరికి స్వాగతం పలికేందుకు యూఎస్ ఆస్ట్రోనాట్ క్రిస్ కాసిడీ, రష్యాకు చెందిన కాస్మోనాట్స్ అనతులీ ఇవానిషిన్, ఐవాన్ వాంగర్ లు సిద్ధంగా ఉన్నారు.