నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించాం: ఏపీ అడ్వొకేట్ జనరల్

30-05-2020 Sat 20:46
  • నిమ్మగడ్డ అంశంలో ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు
  • సుప్రీంను ఆశ్రయించే వరకు స్టే ఇవ్వాలన్న ఏపీ సర్కారు
  • నిమ్మగడ్డ నియామకంలోనే ఉల్లంఘనలు ఉన్నాయన్న ఏజీ
AP Government likely to go Supreme Court

హైకోర్టు తీర్పుతో మళ్లీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టడంపై రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్యణ్య శ్రీరామ్ స్పందించారు. హైకోర్టు తీర్పుపై వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటున్నామని తెలిపారు.

 తాము సుప్రీంను ఆశ్రయించేవరకు నిమ్మగడ్డ వ్యవహారంలో స్టే ఇవ్వాలని హైకోర్టును కోరామని చెప్పారు. ఈ విషయాన్ని పై కోర్టులో సవాల్ చేసే అవకాశం ఏపీ ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు. హైకోర్టు ఇచ్చిన రూలింగ్ లో స్పష్టత కోసం సుప్రీంను ఆశ్రయిస్తామని చెప్పారు. ఎస్ఈసీగా రమేశ్ కుమార్ నియామకంలోనే చట్టపరమైన ఉల్లంఘనలు ఉన్నాయని ఆరోపించారు.