Mahesh Babu: రాముడి గెటప్‌లో మహేశ్‌ బాబు.. వైరల్ అవుతున్న ఫొటో

  • రూపొందించిన ఓ అభిమాని
  • అభిమానులను ఆకర్షిస్తోన్న ఫొటో
  • రాజమౌళి సినిమాలో మహేశ్ పాత్రపై ఆసక్తి
mahesh babu as rama

సినీనటుడు మహేశ్ బాబుకు సంబంధించి ఓ అభిమాని సృష్టించిన ఓ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన రాముడిగా కనపడుతున్నాడు. చేతిలో బాణం పట్టుకుని, కూల్‌గా మహేశ్ బాబు ఉన్నాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో షూటింగులు లేకపోవడంతో ప్రస్తుతం మహేశ్ బాబు ఇంట్లోనే ఈ ఖాళీ సమయాన్ని తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు.

ఈ సందర్భంగా ఆయన తన పిల్లలతో తీసుకున్న ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అలరించాయి. 'ఆర్ఆర్ఆర్‌' సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి తన తర్వాతి సినిమాను మహేశ్ బాబుతో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాలో మహేశ్ బాబు పాత్రపై ఆసక్తి నెలకొంది. ఒకవేళ మహేశ్ బాబుతో రాజమౌళి 'రామాయణం' సినిమా చేస్తే అందులో మహేశ్ ఎలా ఉంటాడన్న విషయాన్ని ఊహిస్తూ ఓ అభిమాని ఈ పోస్టర్‌ను రూపొందించాడు.

More Telugu News