భారతీయులపై జపాన్ ట్రావెల్ బ్యాన్!
- ఇండియాతో పాటు 10 దేశాలపై నిషేధం
- మొత్తం 111 దేశాల వాసులను నిషేధించిన జపాన్
- తక్షణం అమలులోకి వస్తాయన్న షింజో అబే
తాజాగా ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్, అర్జెంటీనా, బంగ్లాదేశ్, ఎల్ శాల్వడార్, ఘనా, గ్వినియా, కిర్గిస్థాన్, పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా, తజికిస్థాన్ దేశాలపై జపాన్ ఆంక్షలు పెట్టింది. ఇదే సమయంలో సరిహద్దుల వద్ద కఠిన ఆంక్షలను అమలు చేయనున్నామని, జూన్ నెల ముగిసేంత వరకూ జపాన్ లో అడుగు పెట్టే ప్రతి ఒక్కరినీ రెండు వారాల పాటు క్వారంటైన్ చేస్తామని షింజో అబే వెల్లడించారు. కాగా, జపాన్ లో ఇంతవరకూ 16,628 మందికి వైరస్ సోకగా, 851 మరణించారు. 13,600 మందికి పైగా కోలుకున్నారు.