కమలహాసన్ తో డేటింగ్ పై నటి పూజా స్పందన

26-05-2020 Tue 20:29
  • కమల్ చాలా కాలంగా నాకు తెలుసు
  • వారి కుటుంబ సభ్యులతో కూడా సాన్నిహిత్యం ఉంది
  • డేటింగ్ వార్తల్లో నిజం లేదు
Actress Pooja Kumar gives clarity on dating with Kamal Haasan

ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ నటి పూజా కుమార్ తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు జోరుగా ప్రచారంలో వున్నాయి. వీరిద్దరూ కలిసి 'ఉత్తమ విలన్', 'విశ్వరూపం', 'విశ్వరూపం 2'లో నటించారు. పలు సందర్బాల్లో వీరిద్దరూ  కలిసి కనిపించారు. దీంతో, వీరిపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. అయితే, ఈ అంశంపై పూజా కుమార్ క్లారిటీ ఇచ్చారు.

తామిద్దరం డేటింగ్ చేస్తున్నామనే వార్తలను పూజ ఖండించారు. చాలా ఏళ్లుగా కమల్ తనకు తెలుసని.. ఆయన కుటుంబ సభ్యులతో కూడా తనకు మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పారు. అందుకే వారి ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా కనిపిస్తుంటానని తెలిపారు. కమల్ తదుపరి చిత్రం 'తలైవన్ ఇరుక్కిరన్'లో తాను నటించబోతున్నానే వార్తలో నిజం లేదని  చెప్పారు.

పూజా కుమార్ తెలుగు చిత్రంలో కూడా నటించారు. 'గరుడవేగ' చిత్రంలో రాజశేఖర్ భార్యగా ఆమె కనిపించారు.