ఉంగరం వేలు పొడువుగా వుండే పురుషులకు కరోనా ముప్పు తక్కువట!
- స్వాన్ సీ వర్సిటీ ఆసక్తికర అధ్యయనం
- టెస్టోస్టిరాన్ స్థాయి అధికంగా ఉన్నవారికి కరోనా ముప్పు తక్కువని వెల్లడి
- టెస్టోస్టిరాన్ కు ఉంగరం వేలు పొడవుకు లింకుందన్న పరిశోధకులు
ఎలాగంటే... గర్భంలోని ఓ పురుష శిశువు ఎంత ఎక్కువగా టెస్టోస్టిరాన్ ప్రభావానికి గురైతే ఉంగరం వేలు అంత పొడవు పెరుగుతుందట. పిండం తక్కువ మోతాదులో టెస్టోస్టిరాన్ ప్రభావానికి గురైతే ఉంగరం వేలు తక్కువ పొడవు పెరుగుతుందట.
ఇక, టెస్టోస్టిరాన్ హార్మోన్ కరోనా విషయంలో ఎందుకు ప్రస్తావనకు వస్తోందంటే.... టెస్టోస్టిరాన్ హార్మోనే కరోనా నుంచి కాపాడే రక్షక కవచాలు అనదగ్గ ఏసీఈ-2 గ్రాహకాలను శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. ఓ వ్యక్తికి కరోనా సోకినప్పుడు వైరస్ తాలూకు లక్షణాలు తగ్గించడంలో ఏసీఈ-2 గ్రాహకాలు ఇతోధికంగా తోడ్పడతాయి.
ఈ పరిశోధన ద్వారా వెల్లడైన అంశం ఏంటంటే, తక్కువ టెస్టోస్టిరాన్ స్థాయి ఉన్న పురుషులకు కరోనాతో మరణించే ముప్పు ఎక్కువట. ఈ టెస్టోస్టిరాన్ స్థాయిని ఉంగరం వేలు పొడవు ఆధారంగా అంచనా వేయొచ్చని స్వాన్ సీ వర్సిటీ పరిశోధకుల అధ్యయనం చెబుతోంది.