టీటీడీ భూముల వేలంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు: వైవీ సుబ్బారెడ్డి
- గత బోర్డు నిర్ణయాలపై సమీక్షించామని వెల్లడి
- భూముల విక్రయం కొత్తేమీ కాదని వ్యాఖ్యలు
- 1974 నుంచి 2014 వరకు విక్రయాలు జరిగాయని వివరణ
భూముల వేలంపై రెండు బృందాలను ఏర్పాటు చేశామని, అయినా టీటీడీలో అన్యాక్రాంతమైన భూములను అమ్మడం కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. భూముల వేలాన్ని తామేమీ ఇప్పుడు కొత్తగా ప్రారంభించింది కాదని, చంద్రబాబు హయాంలోనే భూముల విక్రయం జరిగిందని వివరణ ఇచ్చారు. 1974 నుంచి 2014 మధ్య గత ప్రభుత్వాలు టీటీడీ భూములు విక్రయించాయని వెల్లడించారు. 2016 జనవరి 30న టీటీడీ సబ్ కమిటీ భూముల వేలంపై నిర్ణయం తీసుకుందని, 50 టీటీడీ ఆస్తుల వేలానికి 2016 లోనే తీర్మానం చేశారని వైవీ వివరించారు. టీటీడీ భూముల పరిరక్షణకు మాత్రమే తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.