తండ్రిని 1,200 కి.మీ దూరం సైకిల్ పై తీసుకెళ్లిన బాలికపై ఇవాంకా ట్రంప్ ప్రశంసల జల్లు
- 7 రోజుల పాటు సైకిల్ తొక్కింది
- ఆమెకు ఎంతో ఓర్పు, ప్రేమ ఉన్నాయి
- భారతీయ ప్రజలు, సైకిల్ ఫెడరేషన్‌ను ఆకర్షించింది
ఇందుకు సంబంధించిన వార్తను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఇవాంక.. '15 ఏళ్ల జ్యోతి కుమారి అనే బాలిక గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టి 7 రోజుల పాటు సైకిల్ తొక్కుతూ 1200 కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ఎంతో ఓర్పు, ప్రేమతో ఆమె చేసిన ఈ అద్భుతమైన పని భారతీయ ప్రజలు, సైకిల్ ఫెడరేషన్‌ను ఆకర్షించింది' అని ఆమె తెలిపింది.
కాగా, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యోతి ప్రతిభను ప్రశంసించి, సైక్లింగ్ ట్రయల్స్‌కు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించింది. ఆమె ట్రయల్స్‌లో ఎంపికైతే, ట్రైనీగా అవకాశం ఇచ్చి, ఆ తర్వాత ఆమెకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తారు.