Telangana: తెలంగాణలో కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్... నేడు ముగ్గురి మృత్యువాత

Many more corona cases found in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కొన్నివారాల కింద ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు! కేవలం వేళ్ల మీద లెక్కబెట్టగలిగే రీతిలో కరోనా కేసులు రావడంతో తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందని అందరూ భావించారు. అయితే ఆశ్చర్యకరంగా కరోనా తీవ్రత పెరిగింది. నిత్యం పదుల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.

 ఇక ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 62 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో 42 మంది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు వెలుగు చూడగా, 19 మంది వలస కార్మికులకు కూడా కరోనా సోకినట్టు తేలింది. నేడు మరో మూడు మరణాలు సంభవించగా. మొత్తం మృతుల సంఖ్య 48కి పెరిగింది. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 1,761 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కోలుకున్న వారి సంఖ్య 1,043గా నమోదైంది. ఇవాళ ఏడుగురు డిశ్చార్జి కాగా, ఇంకా 670 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Deaths
Positive
Active Cases

More Telugu News