Crime News: తండ్రిని కత్తితో పొడిచి చంపుతూ.. ఆ దృశ్యాలను జూమ్‌ వీడియో లైవ్‌లో చూపిన కొడుకు

  • పోలీసులకు సమాచారమిచ్చిన మృతుడి స్నేహితులు
  • తండ్రిని చంపి పారిపోయిన కుమారుడు
  • గాలించి పట్టుకుని పోలీసుల విచారణ
us man stabs father

తండ్రిని కత్తితో పొడుస్తూ చంపుతూ ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలను జూమ్‌ వీడియో లైవ్‌లో చూపించాడో కుమారుడు. ఈ ఘటన అమెరికాలోని అమిటీవిల్లేలోని సౌత్ ఓక్స్ హాస్పిటల్ సమీపంలో చోటు చేసుకుంది.

ఆ ప్రాంతంలో ఉండూ  డ్వైట్‌ పవర్స్‌(70) తన స్నేహితులతో జూమ్‌ యాప్‌లో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన ఆయన కుమారుడు స్కల్లీ పవర్స్‌(32) ఓ కత్తితో తండ్రిని దారుణంగా పొడుస్తూ లైవ్‌లో ఆ దృశ్యాన్ని అలాగే చూపించాడు.

దీంతో డ్వైట్‌ స్నేహితులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు.  వెంటనే ఘటనాస్థలికి పోలీసులు చేరుకోగా, అప్పటికే నిందితుడు స్కల్లీ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం అతడి కోసం గాలించిన పోలీసులు స్కల్లీ జాడ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

More Telugu News