Corona Virus: భౌతిక దూరం 6 అడుగుల వల్ల లాభం లేదంటున్న పరిశోధకులు!

  • 18 అడుగుల వరకు వెళుతున్న వైరస్
  • వృద్ధులు, పిల్లలకు ప్రమాదం
  • నికోసియా వర్శిటీ పరిశోధకులు
Six Feet Distance is not Enough to Avoid Virus

కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు భౌతిక దూరాన్ని పాటించడం ఒక్కటే ప్రజల ముందున్న మార్గమని నిపుణులు చెబుతున్న వేళ, ఆరు అడుగుల దూరంతో కరోనా సోకకుండా అడ్డుకోలేమని నికోసియా యూనివర్శిటీ పరిశోధకులు అంటున్నారు.

వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు ఆరు అడుగుల భౌతిక దూరాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా వైరస్ సోకిన వ్యక్తి, చిన్నగా దగ్గితే, ఆ సమయంలో గంటకు 4 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నా, ఐదు సెకన్ల వ్యవధిలోనే వైరస్ 18 అడుగుల దూరం వరకూ వెళ్లిపోతుందని తమ పరిశోధనల్లో గుర్తించామని వారు తెలిపారు. ఈ కారణంతో ఎత్తు తక్కువగా ఉండే పెద్దలు, చిన్న పిల్లలకు మరింత త్వరగా వైరస్ క్రిమి చేరుతుందని పరిశోధకులు హెచ్చరించారు.

More Telugu News