అవినీతి కేసు.. రక్షణశాఖ మాజీ మంత్రులకు మరణశిక్ష విధించిన చైనా కోర్టు
- అవినీతి వ్యవహారంలో వీ ఫెంగే, లీ షాంగ్‌లపై చర్యలు
- లంచాలు స్వీకరించిన కేసులో వీ ఫెంగే దోషి
- లంచాలు తీసుకోవడంతో పాటు ఇవ్వజూపిన కేసులో లీషాంగ్ దోషి
- మరణశిక్ష విధించినప్పటికీ రెండేళ్ల పాటు వాయిదా
ఇద్దరు రక్షణశాఖ మాజీ మంత్రులకు చైనా మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించింది. అవినీతి వ్యవహారంలో వీ ఫెంగే, లీ షాంగ్‌లపై ఈ మేరకు చర్యలు తీసుకుంది. లంచాలు స్వీకరించిన కేసులో వీ ఫెంగే, లంచాలు తీసుకోవడంతో పాటు ఇవ్వజూపిన కేసులో లీ షాంగ్ దోషులుగా తేలారు. కోర్టు వారికి మరణశిక్షను విధించినప్పటికీ, అమలును మాత్రం రెండేళ్ల పాటు నిలిపివేసినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది.
వీ ఫెంగే 2018 నుంచి 2023 వరకు చైనా రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. అంతకుముందు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అత్యంత కీలకమైన రాకెట్ ఫోర్స్‌కు చీఫ్‌గా ఉన్నారు. ఆయన అనంతరం రక్షణ శాఖ మంత్రిగా లీ షాంగ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనను స్వయంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎంపిక చేశారు. కానీ అవినీతి ఆరోపణలపై ఏడాది లోపు తొలగించారు. 2024లో అధికార కమ్యూనిస్టు పార్టీ నుంచి వీరిద్దరిని బహిష్కరించారు. తాజాగా వారికి సైనిక న్యాయస్థానం మరణశిక్ష విధించింది.