పాకిస్థాన్‌లో దారుణం.. యువకుడితో సన్నిహితంగా మాట్లాడారని ఇద్దరు యువతుల దారుణ హత్య
- పాకిస్థాన్‌లో మరోమారు వెలుగులోకి పరువు హత్యలు
- అబ్బాయితో సన్నిహితంగా మాట్లాడడమే వారు చేసిన తప్పు
- కుమారుడితో కలిసి కూతుళ్లను కాల్చి చంపిన తండ్రి
స్థానికంగా ఈ ఘటన కలకలం రేపడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టీనేజీ అమ్మాయిల తండ్రి, సోదరుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కాగా, వైరల్ అయిన ఈ వీడియోలో మరో యువతి కూడా కనిపించగా, ఆమె ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని పోలీసులు తెలిపారు. అంతేకాదు, అమ్మాయిలతో మాట్లాడిన ఆ యువకుడికి కూడా రక్షణ కల్పించనున్నట్టు చెప్పారు.