ఆ రెండు కుక్కలకు యజమానుల ద్వారానే వైరస్ సోకింది: హాంకాంగ్ పరిశోధకులు
- శునకాలు, యజమాని జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు
- కుక్కల నుంచి కుక్కలకు, మనుషులకు వైరస్ సోకుతుందన్న దానికి కనిపించని ఆధారాలు
- కరోనా రోగులు జంతువులకు దూరంగా ఉండాలని సూచన
కరోనా బాధితుల నుంచి కుక్కలకు వైరస్ వ్యాపిస్తుందన్న విషయం నిర్ధారణ అయినప్పటికీ అందుకు గల అవకాశాలు మాత్రం చాలా తక్కువని పేర్కొన్నారు. కరోనా బాధితులతో కలిసి ఉన్న 15 శునకాల్లో కేవలం రెండింటికి మాత్రమే వైరస్ సోకిందని నెదర్లాండ్స్ వైద్యులు తెలిపారు. అయితే, పిల్లులు మాత్రం ఎటువంటి లక్షణాలు లేకుండానే ఇతర పిల్లులకు ఈ వ్యాధిని వ్యాపింపజేసే అవకాశం ఉందన్నారు. కాబట్టి కరోనా రోగులు పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.