విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు
- ఆర్ఆర్ వెంకటాపురంలో ఇటీవల గ్యాస్ లీకేజీ
- కొందరు అస్వస్థతకు గురై పడిపోయిన దృశ్యాలు
- ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తం
తెల్లవారు జామున కొందరు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ విషవాయువు పీల్చి అక్కడే పడిపోయారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. వారిని చాలా సేపటి తర్వాత కొందరు గుర్తించి ఆసుపత్రులకు తరలించారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటన రోజు నిక్షిప్తమైన ఈ దృశ్యాలు నేడు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.