భారత్‌లో తీవ్రతరమైన కరోనా.. చైనాను దాటేసిన కేసుల సంఖ్య
- చైనాలో ఇప్పటి వరకు మొత్తం 82,940 కేసులు
- భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 85,940
- గత 24 గంటల్లో దేశంలో 3,970 మందికి కొత్తగా కరోనా
- మృతుల సంఖ్య మొత్తం 2,752
గత 24 గంటల్లో భారత్‌లో 103 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,752కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 30,153 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 53,035 మంది చికిత్స పొందుతున్నారు.