దారుణం.. కరోనా పేరుతో మణిపూర్ యువతిపై దాడి
- హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘటన
- స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తుండగా ఆపిన పెద్దావిడ
- కరోనా వ్యాప్తి చేస్తున్నావంటూ కర్రతో దాడి
గ్రామంలోని స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లానని, భౌతిక దూరం పాటిస్తూ వారింట్లో భోజనం చేశానని యువతి తెలిపింది. అనంతరం తిరిగి వెళ్తుండగా ఓ పెద్దావిడ తనను ఆపి కరోనా వైరస్‌ను వ్యాపింపజేస్తున్నావంటూ నిందించిందని, రహదారిపైకి వెళ్లొద్దంటూ బెదిరించిందని తెలిపింది. అక్కడితో ఆగకుండా కర్రతో తనపై దాడిచేసిందని, ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కూడా తనపై దాడిచేశారని విలపించింది.