చైనా వెళ్లొచ్చిన ఐదుగురు ఎయిరిండియా పైలట్లకు కరోనా పాజిటివ్
- గ్వాంగ్ జౌ నగరానికి రవాణా విమానాలు నడిపిన ఎయిరిండియా
- పైలట్లు చైనాలో కరోనాకు గురై ఉంటారని అంచనా
- ఇతర పైలట్లలో ఆందోళన
కాగా, ఎయిరిండియా పైలట్లకు కరోనా సోకిందన్న వార్తతో ఇతర పైలట్లలో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వందేభారత్ మిషన్ లో భాగంగా భారత్ పెద్ద సంఖ్యలో విమానాలను విదేశాలకు పంపుతోంది. విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది. కరోనా అత్యంత తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్న న్యూయార్క్ కు కూడా భారత విమానాలు వెళ్లాయి. అయితే, విమానం ఎక్కే ముందు, ప్రయాణం పూర్తయిన తర్వాత తమ పైలట్లకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్టు ఎయిరిండియా పేర్కొంది.