నాలుగు రోజులు.. రూ. 600 కోట్లు.. తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
- నిన్న ఒక్క రోజే రూ.149 కోట్ల విక్రయాలు
- దుకాణాలకు పోటెత్తుతున్న మందుబాబులు
- ధరలు పెంచకపోవడం వల్లే ఈ స్థాయిలో అమ్మకాలు
మిగతా రాష్ట్రాల్లానే మద్యం ధరలను భారీగా పెంచి వుంటే ప్రభుత్వానికి ఆదాయం మరింత వచ్చి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా, ధరలు పెంచకపోవడం వల్లే ఈ స్థాయిలో విక్రయాలు జరిగాయన్న వాదన కూడా ఉంది. కాగా, ఏపీలో మద్యం ధరలపై ఏకంగా 75 శాతం పెంచగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం చీప్ లిక్కర్‌పై 11 శాతం, ఖరీదైన మద్యంపై 16 శాతం పెంచింది.