ప్రేమించాలని వెంటపడి.. పదో తరగతి అమ్మాయి గొంతు కోసిన ఆటోడ్రైవర్.. పరిస్థితి విషమం

auto driver slits throat anantapur girl
  • అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో ఘటన
  • ప్రేమకు ఒప్పుకోని అమ్మాయి
  • పగ పెంచుకున్న యువకుడు
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతోన్న ఓ అమ్మాయి గొంతు కోసి ఓ ఆటోడ్రైవర్ హత్యాయత్నం చేశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. తనను ప్రేమించాలని కొంత కాలంగా ఓ ఆటోడ్రైవర్‌ ఆ అమ్మాయి వెంటపడుతున్నాడు.

అయితే, ఆమె  అందుకు ఒప్పుకోకపోవడంతో పగ పెంచుకుని ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు ఆ బాలికను గుత్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. నిందితుడి పేరు రామాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. బాలికపై హత్యాయత్నం చేసిన వెంటనే అతడు పారిపోయాడని వివరించారు.
Go Back to Shorts
Crime News
Anantapur District

More Telugu News