Kesineni Nani: జగన్ గారూ, బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకూ కోటి నష్టపరిహారం ఇస్తే బాగుండేది: టీడీపీ ఎంపీ కేశినేని

TDP MP Kesineni Nani tweet
షార్ట్స్‌లో చూడండి
విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కు టీడీపీ ఎంపీ కేశినేని ఓ సూచన చేశారు. గతంలో గోదావరి నది బోటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కూడా కోటి రూపాయలు ఇచ్చి వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ఆ కుటుంబాలకు బ్యాలన్స్ అమౌంట్ ఇవ్వాలని సూచించారు. ప్రజలందరినీ సమానంగా చూడాలి గానీ ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం ఉండకూడదని అన్నారు.
Go Back to Shorts
Kesineni Nani
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News