విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై కేసీఆర్, కేటీఆర్ స్పందన
- దిగ్భ్రాంతికి గురయ్యామన్న నేతలు
- గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరం
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకుని విస్మయానికి గురయ్యానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చాలా భయంకర ఘటనలు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.