Corona Virus: ఇండియాలో 50 వేల మార్క్ దాటిన కరోనా కేసులు

Corona cases in india crosses 50000
షార్ట్స్‌లో చూడండి
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు 50 వేల మార్క్ ను దాటాయి. కేరళలో తొలి పాజిటివ్ కేసు నమోదైన నాలుగు నెలల తర్వాత ఈ మార్క్ ను భారత్ దాటింది. మొత్తం కేసుల సంఖ్య 50,545కి చేరుకుంది. గత మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా 10 వేల కేసులు నమోదయ్యాయి. ఇండియాలోని మొత్తం కేసుల్లో 16,758 కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఈ ఒక్కరోజే కొత్తగా 1,233 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ 6,200కు పైగా కేసులతో రెండో స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,650 దాటింది.
Go Back to Shorts
Corona Virus
Deaths
India

More Telugu News