Pakistan: పాకిస్థాన్ చరిత్రలోనే తొలిసారి.. పాక్ ఎయిర్ ఫోర్స్ లో హిందూ యువకుడు

  • పైలట్ గా ఎంపికైన రాహుల్ దేవ్
  • గుడ్ న్యూస్ చెపుతున్నామన్న ఎయిర్ ఫోర్స్
  • రాహుల్ ది సింధ్ ప్రావిన్స్ లోని మారుమూల ప్రాంతం
Hindu man selected for Pakistan Air Force

పాకిస్థాన్ చరిత్రలో తొలిసారి ఓ హిందూ యువకుడు ఆర్మీలో నియమితుడయ్యాడు. జనరల్ డ్యూటీ పైలట్ అధికారిగా రాహుల్ దేవ్ ను నియమించినట్టు పాక్ ఎయిర్ ఫోర్స్ అధికారిక ప్రకటన చేసింది. కరోనా సంక్లిష్ట సమయంలో ఈ గుడ్ న్యూస్ చెబుతున్నామని తెలిపింది. సింధ్ ప్రావిన్స్ లోని థర్పర్కర్ అనే మారుమూల గ్రామం నుంచి జనరల్ డ్యూటీ పైలట్ గా రాహుల్ ఎంపికయ్యారని వెల్లడించింది. పాకిస్థాన్ అధికారిక రేడియో కూడా ఈరోజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. పాక్ చరిత్రలోనే తొలిసారిగా పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ లో ఓ హిందూ యువకుడు నియమితులయ్యారని పాక్ రేడియో తెలిపింది.

More Telugu News