Jagan: జగన్ ను విమర్శించడంతో మీ బుద్ధి ఏంటో ప్రజలకు అర్థమయింది: వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు

Golla Babu Rao fires on Anitha
మద్యం షాపులను తెరవాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోకుండా ముఖ్యమంత్రి జగన్ ను విమర్శిస్తుండటంతో టీడీపీ నేతల బుద్ధి ఏమిటో ప్రజలకు అర్థమయిందని చెప్పారు.

పది మంది తుగ్లక్ లను కలిపితే జగన్ అంటూ టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. విమర్శలు చేసే ముందు స్థాయి తెలుసుకోవాలని మండిపడ్డారు. కరోనా సమయంలో అనిత తన సొంత నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించాలి... నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రానికి ద్రోహం చేసింది చంద్రబాబేనని ఆరోపించారు.
Jagan
Golla Babu Rao
YSRCP
Chandrababu
Anitha
Telugudesam

More Telugu News