srimukhi: ప్రముఖ యాంకర్ శ్రీముఖిపై కేసు నమోదు!

  • బ్రాహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణ
  • శ్రీముఖితో పాటు టీవీ ఛానెల్ యాజమాన్యంపైనా ఫిర్యాదు
  • నల్లకుంటకు చెందిన వ్యక్తి  ఫిర్యాదుతో కేసు నమోదు
police case against Anchor Srimukhi

ప్రముఖ టీవీ యాంకర్  శ్రీముఖిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఓ టీవీ ఛానెల్  షో లో యాంకర్ గా వ్యవహరించిన శ్రీముఖి, బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైనట్టు సమాచారం. శ్రీముఖితో పాటు సదరు టీవీ ఛానెల్ యాజమాన్యంపైనా హైదరాబాద్, నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసినట్టు సమాచారం.

More Telugu News