నవ్వుల్లో ముంచెత్తుతున్న అభినయం.. డేవిడ్ వార్నర్ పోస్ట్ చేసిన మరో వీడియో వైరల్!
- విలియమ్సన్, భువనేశ్వర్‌తో డ్యాన్స్
- గతంలో తీసిన ఫన్నీ వీడియో పోస్ట్
- ఈ దృశ్యాలు నవ్వుల్లో ముంచెత్తాయని వ్యాఖ్య
‘వాట్ ఈజ్ లవ్’ ప్లే పాట వస్తుండగా వారంతా డ్యాన్స్ వేస్తున్నట్లు చేతులు, కాళ్లు ఆడించారు. తమ సీట్లలోనే కూర్చొని వారు డ్యాన్స్ చేయడం ఫన్నీగా ఉంది. విలియమ్సన్, భువనేశ్వర్ కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు కనపడ్డారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన వార్నర్.. తనను ఈ దృశ్యాలు నవ్వుల్లో ముంచెత్తాయని చెప్పాడు. ఇటీవల భార్య క్యాండీస్‌తో కలిసి వార్నర్ బుట్టబొమ్మ పాటకు వేసిన స్టెప్పులు తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.