క్వారంటైన్‌లో ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం

Woman raped in quarantine center
  • రాజస్థాన్ సవాయి మాధోపూర్ బటోడా పీఎస్ పరిధిలో దారుణ ఘటన
  • సొంతూరుకు బయల్దేరిన మహిళను క్వారంటైన్ లో ఉంచిన స్థానికులు
  • అదను చూసుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు
క్వారంటైన్ లో ఓ మహిళపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ లో కలకలం రేపుతోంది. సవాయి మాధోపూర్ బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం ఈ ఘటన చోటుచేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, జైపూర్ కు చెందిన ఓ మహిళ లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా లాక్ డౌన్ ను ఎత్తేయకపోవడంతో... కాలినడకన ఆమె సొంతూరుకు బయల్దేరింది.

గురువారం రాత్రి  ఆమె మాధోపూర్ కు చేరుకోగా... స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉంచారు. దీన్ని అదనుగా తీసుకున్న ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో పాఠశాలకు చేరుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
Quarantine Centre
Woman
Rape
Rajasthan

More Telugu News