Mangos: ఇంటికే కోరినన్ని మామిడి పళ్లు... తెలంగాణ ఉద్యానవన శాఖ డోర్ డెలివరీ పథకం!

  • 5 కిలోల కార్టన్ బాక్స్ రూ. 350
  • మే ఒకటి నుంచి బుకింగ్స్
  • 79977 24925 లేదా 79977 24944 నంబర్ల ద్వారా బుకింగ్
Mangoes Door Delivery By Government

ఈ వేసవి మామిడి ప్రియులకు ఒకింత చేదు అనుభవాన్నే మిగిల్చింది. లాక్ డౌన్ కారణంగా మార్కెట్లు సరిగ్గా తెరచుకోకపోవడం, ప్రజలు కరోనా భయంతో రోడ్లపైకి రావడానికి భయపడుతున్న వేళ, మామిడి పండ్ల అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యానవన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటిస్తూ, సేకరించిన కాయలను సహజ పద్ధతిలో మాగబెట్టి, 5 కిలోల చొప్పున కార్టన్ బాక్స్ లలో ప్యాక్ చేసి, ప్రజలకు ఇంటి వద్ద డెలివరీ చేయాలని నిర్ణయించింది.

ఇందుకు తపాలా శాఖ పార్శిల్ సర్వీస్ సేవలను వినియోగించుకుంటున్నామని, 5 కిలోల బాక్స్ కు డెలివరీ చార్జీలను కలిపి రూ. 350 చెల్లించాలని, సుమారు 12 నుంచి 15 బంగినపల్లి కాయలు వస్తాయని అధికారులు వెల్లడించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలోపు 79977 24925 లేదా 79977 24944 నంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వవచ్చని తెలిపారు. ఆర్డర్ ఇచ్చిన తరువాత 4 నుంచి 5 రోజుల్లో డెలివరీ అందుతుందని, మే 1వ తేదీ నుంచి బుకింగ్స్ స్వీకరిస్తామని పేర్కొన్నారు.

More Telugu News