Mopidevi Venkataramana: టీడీపీ స్లీపర్ సెల్స్ ‘కరోనా’ను వ్యాప్తి చేస్తున్నాయేమోనన్న అనుమానం కలుగుతోంది: ఏపీ మంత్రి మోపిదేవి

Minister Mopidevi comments On TDP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ‘కరోనా’ కట్టడికి తమ ప్రభుత్వం ఇంత చేస్తున్నా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి మండిపడ్డారు. చంద్రబాబు ఆర్భాటం అంతా ప్రచారం కోసమేనని విమర్శించారు. ప్రజలను ఆదుకునేందుకు ఎందుకు సహకరించడం లేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ‘కరోనా’ ను టీడీపీ స్లీపర్ సెల్స్ వ్యాప్తి చేస్తున్నాయేమోనన్న అనుమానం కలుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘కరోనా’ నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని, వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ఆక్వా ఉత్పత్తులకు తొలిసారిగా ఓ నిర్దేశిత ధర కల్పించామని, విత్తన ఉత్పత్తి కోసం 450 హేచరీస్ ఏపీలో ఉన్నాయని చెప్పారు. గుజరాత్ లోని ఏపీ మత్స్యకారులను ఇక్కడికి రప్పించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు.
Go Back to Shorts
Mopidevi Venkataramana
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News