Harish Rao: 20 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటివరకు.. కేసీఆర్‌తో దిగిన ఫొటోలు పోస్ట్ చేసి హరీశ్‌ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

harish with kcr images
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో మొదటి నుంచి సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్ రావు అందించిన సాయం మరవలేనిది. కేసీఆర్‌ వెంట ఉంటూ ఆయన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎంతో కృషి చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హరీశ్ రావు 20 ఏళ్లుగా కేసీఆర్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలను పోస్ట్ చేశారు.
                                          
'ఉద్యమం నిప్పురవ్వగా మొదలైన రోజులు తలుచుకుంటే మనసు గర్వంతో నిండిపోతుంది. ఉద్యమం దావానలమై లక్ష్యాన్ని ముద్దాడినప్పుడు జన్మధన్యమైన సంతృప్తి. 20 ఏళ్లుగా కేసీఆర్ గారి బాటలో నడుస్తున్న సైనికుడికి ఇదొక జీవిత కాల సాఫల్యం.  బిందువు నుండి సింధువుగా మారిన టీఆర్ఎస్' అని హరీశ్ రావు పేర్కొన్నారు.
                     

                               
'తెలంగాణా ప్రజలు తమను తాము పరిపాలించుకోవాలనే ఆకాంక్షకు రాజకీయ వ్యక్తీకరణగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది ఈ ఇరవై ఏండ్లలో చరిత్ర గతినే మార్చి వేసి, చిరకీర్తిని సంపాదించుకున్నది' అని హరీశ్‌ రావు అన్నారు.

'కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్ఫూర్తి కలకాలం నిలవాలి. ఉద్యమ దీప్తి ఇలాగే వెలుగొందుతూ ఉండాలి' అని హరీశ్ రావు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల రీత్యా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించుకుంటున్నారు.

Go Back to Shorts
Harish Rao
KCR
TRS

More Telugu News