నాడు ఒక్క పిడికిలి బిగిస్తే, కోట్ల పిడికిళ్లు అయినయ్: కేటీఆర్

KTR Tweet On TRS Foundation Day
  • టీఆర్ఎస్ పార్టీ పుట్టి 20 సంవత్సరాలు
  • హంగు, ఆర్భాటం లేకుండా వేడుకలు
  • ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు అత్యంత నిరాడంబరంగా సాగుతున్నాయి. పార్టీని స్థాపించి, 20 సంవత్సరాలు కాగా, లాక్ డౌన్ కారణంగా, సామాజిక దూరాన్ని పాటిస్తూ, జిల్లా కార్యాలయాల్లో టీఆర్ఎస్ శ్రేణులు హంగు, ఆర్భాటాలకు పోకుండా జాతీయ పతాకాలను ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ యువనేత, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.

"ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు
ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది
స్పూర్తి ప్రదాతా వందనం ...ఉద్యమ సూర్యుడా వందనం.
20 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ
ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
జై తెలంగాణా ! జై జై కేసీఆర్!!" అంటూ ఆయన ట్వీట్ పెట్టారు.
Go Back to Shorts
KTR
TRS
Twitter
Foundation Day

More Telugu News