ఏపీలో మరో 80 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ.. కర్నూలులో కొత్తగా మరో 31 మందికి కరోనా
- గుంటూరులో కొత్తగా 18 కేసులు
- చిత్తూరు జిల్లాలో 14, అనంతపురంలో 6
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 893
కొన్ని రోజులుగా రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఏపీలో నమోదవుతున్న కేసుల్లో 46 శాతానికి పైగా కేసులు ఈ రెండు జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వివరించారు. ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 27కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 725గా ఉంది. 141 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఏయే జిల్లాల్లో ఎన్నెన్ని కేసులు?