అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోన్న త్రిష నిర్ణయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోన్న త్రిష నిర్ణయం

Ramesh Varma Movie
  • తెలుగు .. తమిళ భాషల్లో త్రిషకి మంచి క్రేజ్
  • ఇటీవల కాలంలో తగ్గుతూ వచ్చిన అవకాశాలు
  • 'ఆచార్య' నుంచి తప్పుకున్న త్రిష  

తెలుగు ... తమిళ భాషల్లో కథానాయికగా త్రిషకి మంచి క్రేజ్ వుంది. ఈ రెండు భాషల్లోను టాప్ హీరోయిన్ గా ఆమె కొన్నేళ్ల పాటు తన హవాను కొనసాగించింది. అయితే ఇటీవల కాలంలో కొత్త కథానాయికల పోటీ కారణంగా ఆమె జోరు తగ్గింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవితో కొరటాల చేస్తున్న 'ఆచార్య' సినిమాలో కథానాయికగా ఆమెను తీసుకున్నారు. ఆలస్యంగానైనా భారీ ఆఫర్ నే కొట్టేసిందని అంతా అనుకున్నారు.

అయితే కొన్ని రోజుల తరువాత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు త్రిష  ప్రకటించింది. తన పాత్రకి ప్రాధాన్యత లేదనే కారణంగా 'నో'  చెప్పిందని కొందరంటే, తమిళ సినిమాల్లో బిజీగా ఉండటం వలన అని మరికొందరు అన్నారు. అలాంటి త్రిష ఇప్పుడు రవితేజ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో ఆమె ఎంపిక జరిగిపోయిందని అంటున్నారు. దాంతో 'ఆచార్య' సినిమాకి నో చెప్పిన త్రిష, రవితేజతో జతకట్టడానికి ఒప్పుకోవడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందట.
Chiranjeevi
Koratala Siva
Ramesh Varma
Trisha

More Telugu News