కరోనా లక్షణాలతో మృతి చెందిన వారి నుంచి శాంపిల్స్ సేకరించొద్దు: తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్
- కరోనా లక్షణాలతో మరణించిన వారిని పాజిటివ్‌గానే పరిగణించాలని సూచన
- ఇక నుంచి ఇంటి వద్దే కరోనా పరీక్షలు
- వాహనం సిద్ధం చేస్తున్న అధికారులు
మరోవైపు, కరోనా వైరస్ సోకి మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులు, సన్నిహితులను కూడా క్వారంటైన్ చేసి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, ఇక నుంచి ఇంటి వద్దే కరోనా పరీక్షలు నిర్వహించాలని కూడా యోచిస్తోంది. ఇందుకోసం సన్నద్ధమవుతున్న ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వాహనాన్ని కూడా తయారు చేస్తోంది. తొలుత ఈ సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.