హైదరాబాద్ లో వెల్లివిరిసిన మానవత్వం... ఇరుగుపొరుగు కాదన్నవేళ హిందువు పాడె మోసిన ముస్లింలు!
- క్షయతో మృతి చెందిన ఆటో డ్రైవర్
- కరోనాతో చనిపోయాడని భావించి సహాయ నిరాకరణ చేసిన స్థానికులు
- అంత్యక్రియలు జరిపించిన ముస్లింలు
కాగా, ఇరుగుపొరుగు వారు మాత్రం వేణు కరోనాతో చనిపోయాడని భావించి అతడి మృతదేహాన్ని కాలనీకి తీసుకువచ్చేందుకు అభ్యంతరం చెప్పారు. సాయం చేసేందుకు నిరాకరించారు. వేణు పిల్లల వద్ద అంత్యక్రియలకు అవసరమైన డబ్బు కూడా లేదు. ఈ విషయం తెలిసిన సాదిక్ బిన్ సలామ్ అనే ముస్లిం సామాజిక కార్యకర్త తన నలుగురు మిత్రులైన మాజిద్, ముక్తాదిర్, అహ్మద్, ఖాసిమ్ లకు సమాచారం అందించాడు. వెంటనే వారందరూ అక్కడికి చేరుకుని ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. హిందూ శ్మశానవాటిక వరకు పాడె మోసి వేణు అంత్యక్రియలు జరిపించారు.
అనంతరం సలామ్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తికి తమ సామాజిక వర్గమే కారణమని ఆరోపణలు వస్తున్నా, అందరం ఒక్కటేనని ఈ విధంగా నిరూపించామని, విభేదాలు, విద్వేషాలు రగిల్చే ప్రయత్నాలను పట్టించుకోకుండా ముందుకు వచ్చామని తెలిపారు.