కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు.. ఇప్పటికీ జగన్ తీరు మారడం లేదు: కేశినేని నాని
- కరోనా టెస్టింగ్ కిట్లలో అవినీతి చోటుచేసుకుంది
- ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశారు
- కరోనా బాధితుల సంఖ్యను కూడా కచ్చితంగా చెప్పడం లేదు
కరోనా టెస్టింగ్ కిట్లలో అవినీతి చోటుచేసుకుందని... వైసీపీ ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడిందని కేశినేని నాని మండిపడ్డారు. అధిక ధరలకు టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రజాధనాన్ని డుర్వినియోగం చేశారని విమర్శించారు. కరోనాను ముఖ్యమంత్రి జగన్ చాలా తేలికగా తీసుకున్నారని.... తద్వారా ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేశారని చెప్పారు. కరోనా బాధితుల సంఖ్యను కూడా కచ్చితంగా వెల్లడించడం లేదని దుయ్యబట్టారు. జగన్ కు ప్రజల రక్షణ కన్నా... రాజకీయాలే ప్రధానమని విమర్శించారు. ఇప్పటికీ జగన్ తన తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారు.