200 మంది నీలోఫర్ ఆసుపత్రి సిబ్బందికి క్వారంటైన్ : ఆదేశాలు జారీచేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్
- ఆసుపత్రిలో చికిత్స పొందిన 45 రోజు చిన్నారికి కరోనా
- ఈనెల 15, 16, 17 తేదీల్లో బాలుడికి చికిత్స
- ఆ రోజుల్లో పనిచేసిన అందరికీ క్వారంటైన్
వివరాల్లోకి వెళితే...నారాయణపేట్ జిల్లా అభంగాపూర్‌కు చెందిన మహిళ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించింది. డిశ్చార్జి అయ్యాక నలభై ఐదు రోజుల వయసున్న చిన్నారికి జ్వరం రావడంతో అతని తండ్రి స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారిని తీసుకువెళ్లారు.
అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారి నుంచి సేకరించి శాంపిల్స్‌తో కరోనా పాజిటివ్ అని తేలడంతో సూపరింటెండెంట్ ఈ ఆదేశాలు జారీచేశారు. అలాగే చిన్నారి కుటుంబ సభ్యులు ఆరుగురిని కూడా క్వారంటైన్‌కు తరలించారు.