గుంటూరులో అన్నార్తులకు ఆహారం అందించేందుకు ముందుకు వచ్చిన బీజేపీ

BJP food for poor in Guntur
  • గుంటూరులో రోజుకి 500 మందికి పౌష్టికాహారం
  • లాక్‌డౌన్‌ ముగిసే వరకు కొనసాగిస్తామని ప్రకటన
  • ఆకలితో అలమటిస్తున్న వారికి ఊరటనిచ్చే కార్యక్రమం
లాక్‌డౌన్‌ కష్టకాలంలో అన్నార్తులను ఆదుకునేందుకు గుంటూరు అర్బన్ జిల్లా బీజేపీ విభాగం ముందుకు వచ్చింది. మే మూడో తేదీ వరకు రోజుకి ఐదు వందల మందికి పౌష్టికాహారం సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. లాక్‌డౌన్‌ కారణంగా వ్యవస్థలన్నీ స్తంభించిపోయి ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో పట్టణాల్లో నిరాశ్రయులు, వలసకూలీలు, యాచకులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమందికైనా ఈ చర్య వల్ల ఊరట లభిస్తుంది. లాక్‌డౌన్‌ ముగిసే వరకు పార్టీ తరపున ఈ కార్యక్రమం కొనసాగుతుందని గుంటూరు అర్బన్‌ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు తెలిపారు. ఈ చర్య మరికొన్ని జిల్లాల్లో వారికి స్ఫూర్తినిస్తుందేమో చూడాలి.
Go Back to Shorts
Guntur District
food for poor

More Telugu News