హీరోయిన్ శ్రియ భర్తకు కరోనా లక్షణాలు!
- ఆండ్రూ కొచీవ్ కు జలుబు, జ్వరం
- ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారు
- సమస్య తీవ్రమైతే ఆసుపత్రికి తీసుకెళతామన్న శ్రియ
కాగా, ప్రస్తుతం ఈ జంట స్పెయిన్ లో ఉంది. స్పెయిన్ లో కరోనా మరణమృదంగాన్ని మోగిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తన భర్తతో తాను చాలా ఆనందంగా ఉన్నానని చెబుతూ, ఇటీవలే శ్రియ తన సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను పోస్ట్ చేసింది. ఇంతలోనే తన భర్తలో కరోనా లక్షణాలు కనిపించాయని ఆమె చెప్పడంతో ఫ్యాన్స్ లోనూ కొంత ఆందోళన నెలకొంది. ఇక ఆండ్రూకు కరోనా టెస్ట్ జరిగిందా? పాజిటివ్ వచ్చిందా? లేదా? అన్న విషయమై శ్రియ ఎటువంటి సమాచారాన్ని అందించలేదు.