ఐపీఎల్ మరికొంతకాలం వాయిదా.. బీసీసీఐ యోచన!
- లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో బీసీసీఐ యోచన
- ఈ నెల 15వ తేదీకి వాయిదా పడ్డ మెగా లీగ్
- నిరవధికంగా వాయిదా వేసే అవకాశం
వాస్తవానికి ఐపీఎల్ పదమూడో సీజన్ భవితవ్యంపై సోమవారం బీసీసీఐ ఆఫీస్ బేరర్లు కాన్ఫరెన్స్ కాల్‌లో చర్చించాల్సి ఉంది. అయితే, లాక్‌డౌన్ పై ప్రధాని జాతిని ఉద్దేశించే ప్రసంగం ఈ రోజుకు వాయిదా పడడంతో ఈ సమావేశాన్ని బీసీసీఐ విరమించుకుంది. లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాకే తుది నిర్ణయం తీసుకోవాలని భావించింది. లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో రేపు కొన్ని మార్గనిర్దేశకాలు ప్రకటిస్తామని మోదీ తెలిపారు. అవి వెలువడిన తర్వాత ఐపీఎల్‌పై బోర్డు నిర్ణయానికి వచ్చే చాన్సుంది. దేశంలో పరిస్థితులు మెరుగయ్యే వరకూ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది.