సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలేసిన వాళ్లకు రాజకీయాలెందుకు?: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy pummels mega brothers
  • చిరు తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవని వ్యాఖ్యలు
  • పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చిందంటూ ఎద్దేవా
  • రెండు చోట్ల ఓడిపోతాడని అందరికీ తెలుసంటూ ట్వీట్
రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి జనసేనాని పవన్ కల్యాణ్ పైనా, ఆయన సోదరుడు నాగబాబుపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికి వదిలేసినవాళ్లకు రాజకీయాలెందుకు అంటూ ప్రశ్నించారు. 2014లోనే తాము పొత్తులు పెట్టుకోలేదని, పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించారని వివరించారు. చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవని విమర్శించారు. పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చిందంటూ ఎద్దేవా చేశారు.

"చంద్రబాబు కోసం ప్యాకేజి తీసుకుని పుట్టిన పార్టీ అది. రిజిస్టర్ చేసినప్పటి నుంచి ఎవరి కోసం తోక ఊపుతూ మాట్లాడాడో ప్రజలందరికీ తెలుసు. అలాంటి పార్టీతో మేం పొత్తు పెట్టుకుంటామని కలేమైనా కన్నారా? పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల చిత్తుగా ఓడిపోతాడని అందరికీ ముందే తెలుసు" అంటూ ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విజయసాయిరెడ్డిపై నాగబాబు వ్యాఖ్యానిస్తూ.... అప్పట్లో కామన్ ఫ్రెండ్ ద్వారా తన ఇంటికి పొత్తు కోసం వచ్చారంటూ విరుచుకుపడ్డారు. ఆ వ్యాఖ్యలకు ప్రతిగానే విజయసాయిరెడ్డి తాజా ట్వీట్లు చేసినట్టు అర్థమవుతోంది.
Go Back to Shorts
Vijay Sai Reddy
Pawan Kalyan
Nagababu
Chandrababu
Andhra Pradesh

More Telugu News