తల్లికి ఔషధాల కోసం యువతి టిక్ టాక్... వెంటనే స్పందించిన కర్ణాటక సీఎం!
- మహిళకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అపరేషన్
- 20 రోజులుగా మందులు లేక క్షీణించిన ఆరోగ్యం
- టిక్ టాక్ వీడియో చూసి యడియూరప్ప స్పందన
- నెల రోజుల మెడిసిన్స్ ను ఇంటికి చేర్చిన అధికారులు
ఇదే సమయంలో గడచిన 20 రోజులుగా శాఖవ్వకు కావాల్సిన మందులు దొరకని పరిస్థితి ఏర్పడటంతో, ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె కుమార్తె పవిత్ర, తల్లి బాధను చెబుతూ, టిక్ టాక్ వీడియో చేసింది. ఈ వీడియో వైరల్ అయి, యడియూరప్పను చేరగా, ఆయన సూచనతో, జిల్లా అధికారులు నిన్న శాఖవ్వ ఇంటికి వెళ్లారు. నెల రోజులకు సరిపడా మందులను అందించారు. మరేదైనా సమస్య ఏర్పడితే, తమకు తెలియజేయాలని సూచించారు.