భారత్‌పై ట్రంప్ నిన్న కారాలుమిరియాలు.. నేడు ప్రశంసలు!
- హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇప్పటికే కొన్ని మిలియన్ డోసులు కొన్నాను
- భారత ప్రధాని మోదీతో నేను మాట్లాడాను
- వాటిని పంపిస్తారా? అని మోదీని అడిగాను
- సానుకూలంగా స్పందించారు
'హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇప్పటికే కొన్ని మిలియన్ డోసులు కొన్నాను. దాదాపు 29 మిలియన్ల డోసులు కొన్నాను. భారత ప్రధాని మోదీతో నేను మాట్లాడాను.. భారత్ నుంచి మాకు ఆ ఔషధాలు పెద్ద మొత్తంలో రావాల్సి ఉంది. వాటిని పంపిస్తారా? అని మోదీని అడిగాను. సానుకూలంగా స్పందించారు. ఆయన చాలా మంచి దృక్పథంతో ఉన్నారు. భారత్‌కు కూడా ఆ ఔషధాలు చాలా అవసరం, అందుకే వాటి ఎగుమతులను ఆపేశారు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవల మోదీతో మాట్లాడిన ట్రంప్ హైడ్రాక్సీ క్లోరిక్విన్‌ను ఎగుమతి చేయాలని కోరారు. అయితే, ఆ మరుసటి రోజే భారత్ హైడ్రాక్సీ క్లోరిక్విన్‌తో పాటు పలు ఔషధాల విడుదలపై నిషేధం విధించింది. దీంతో ట్రంప్ భారత్‌పై మండిపడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇప్పుడు మళ్లీ భారత్ ఆ నిషేధం ఎత్తి వేస్తూ పలు దేశాలకు సరఫరా చేస్తామని ప్రకటించడంతో ట్రంప్ మళ్లీ కూల్ అయి భారత్‌పై ప్రశంసలు కురిపించారు.