మారిపోతున్న మల్టీప్లెక్స్ లు... త్వరలోనే సినిమాల ప్రదర్శన మొదలు!
- లాక్ డౌన్ తో కుదేలైన సినీ రంగం
- థియేటర్లలో సీట్ల మధ్య దూరం పెంచుతున్న మల్టీప్లెక్స్ లు
- వచ్చే వారికి ఉచిత మాస్క్ లు, షో తరువాత శానిటైజేషన్
ఇందులో భాగంగా, సీటుకు, సీటుకు మధ్య దూరాన్ని పెంచుతున్నారు. దాదాపు 500 సీట్లు ఉండే స్క్రీన్ లో 150 మాత్రమే ఉండేలా మారుస్తున్నారని సమాచారం. ఇక, సినిమాకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ ఫేస్ మాస్క్ ను ఉచితంగా ఇవ్వాలని, ఆపై షో ముగిసిన తరువాత, థియేటర్ అంతా శానిటైజర్లతో శుభ్రపరచాలని కూడా ఆలోచనలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ఇవి ఫలవంతమైతే, త్వరలోనే మల్టీప్లెక్స్ ల్లో సినిమాలు చూడవచ్చని సినీ వర్గాలు అంటున్నాయి.