Allu Arjun: సుకుమార్ అనుకున్న రిలీజ్ డేట్!

  • బన్నీ హీరోగా సుకుమార్ మూవీ 
  •  ప్రతినాయక పాత్రలో విజయ్ సేతుపతి 
  •  వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదల
Sukumar Movie

'నాన్నకు ప్రేమతో' సినిమాతో క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న సుకుమార్, 'రంగస్థలం' సినిమాతో మాస్ ఆడియన్స్ ను అలరించాడు. ఈ సారి కూడా ఆయన మరో మాస్ సబ్జెక్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా బన్నీ కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా రష్మికను తీసుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా షూటింగుకి వెళ్లడం ఆలస్యమవుతోంది. దాంతో ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయాలని సుకుమార్ భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. సహజంగానే సుకుమార్ తన ప్రాజెక్టులకి ఎక్కువ సమయం తీసుకుంటాడు. అందువల్లనే ఆయన ఈ రిలీజ్ డేట్ సెట్ చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News