Georgereddy: గుర్తింపు కార్డులు లేని సినీ కార్మికులకు ‘జార్జిరెడ్డి’ చిత్ర యూనిట్ సాయం

  • లాక్ డౌన్ నేపథ్యంలో పేద సినీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
  • 10 రోజులకు సరిపడా కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు అందజేత: 
  • సామాజిక స్పృహతో వ్యవహరించాలి: నిర్మాత అన్నపురెడ్డి అప్పిరెడ్డి
Georgre Reddy movie unit helps to cine labour

ఉస్మానియా యూనివర్శిటీలో నాటి విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితం ఆధారంగా కొన్ని నెలల క్రితం విడుదలైన చిత్రం ‘జార్జిరెడ్డి’. లాక్ డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులకు సాయంగా నిలిచే నిమిత్తం ఈ చిత్ర యూనిట్ ముందుకొచ్చింది. సినీ కార్మికులుగా పనిచేస్తున్నప్పటికీ  గుర్తింపు కార్డులు లేని వారికి ఆసరాగా నిలుస్తూ వారి కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

జార్జిరెడ్డి చిత్ర నిర్మాతలు అన్నపురెడ్డి అప్పిరెడ్డి, దామురెడ్డి, దర్శకుడు జీవన్ రెడ్డి తో పాటు ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన సందీప్, ఇతర నటులు తదితరులు సినీ కార్మికులకు పదిరోజులకు సరిపడా నిత్యావసరాలు కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు అందజేశారు. ఈ సందర్భంగా అన్నప్పురెడ్డి అప్పిరెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి పరిస్థితుల్లో తోటి వారికి సాయం చేయాలని, సామాజిక స్పృహతో వ్యవహరించాలని అన్నారు.

More Telugu News