ఏపీలో మరిన్ని పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు.. నెల్లూరులో అత్యధికంగా 32 కేసులు

coronavirus cases in ap
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు మరిన్ని పెరిగిపోయాయి. నిన్న రాత్రి 10.30 గంటల నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల మధ్య కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరిందని ఏపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. నెల్లూరులో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో అత్యధికంగా 27, గుంటూరు, కడప జిల్లాల్లో 23 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఏపీలో అత్యధిక బాధితులు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే ఉన్నారు.
           
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh

More Telugu News