కరోనాను ఓడించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కేరళ వృద్ధ దంపతులు

Kerala old couple defeats corona virus
  • ఇటీవలే ఇటలీ నుంచి వారి కుమారుడి రాక
  • కుమారుడి ద్వారా వృద్ధ దంపతులకు కరోనా వ్యాప్తి
  • భర్త వయసు 93 ఏళ్లు, భార్య వయసు 88
  • పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
కరోనా వైరస్ వృద్ధులను ఎక్కువగా కబళిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, కేరళకు చెందిన ఓ వృద్ధ జంట మాత్రం కరోనాను ఓడించి దిగ్విజయంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయింది. ప్రాణాంతక వైరస్ బారినపడినా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్న ఆ జంట సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవడంతో డాక్టర్లు ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు.

పత్తనంతిట్ట ప్రాంతానికి చెందిన ఈ వయోవృద్ధ జంట ఇటీవలే కరోనాతో ఆసుపత్రిపాలైంది. వారిలో భర్త వయసు 93 ఏళ్లు కాగా, భార్య వయసు 88 సంవత్సరాలు. వారి తనయుడు కొన్నిరోజుల క్రితం ఇటలీ నుంచి కుటుంబసమేతంగా స్వస్థలానికి వచ్చాడు. కొడుకు ద్వారా ఆ వృద్ధ దంపతులకు కరోనా సోకింది. దాంతో వారిద్దరినీ కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు అందించిన చికిత్సతో ఇరువురు వైరస్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.
Go Back to Shorts
Kerala
Old Couple
Corona Virus
Kottayam
COVID-19

More Telugu News